వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్
కోహిర్ ; జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్స్‌లో బిలాల్‌పూర్ మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి కుమారుడి వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ ఎ. చంద్రశేఖర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వివాహ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, కోహిర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్షద్ అలీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సువర్ణ మల్లన్న పాటిల్, కోహిర్ పట్టణ అధ్యక్షుడు ముజాఫర్, కేతకీ సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు, సర్పంచులు అహ్మద్ అలీ, అశోక్, దయానంద్ పాటిల్, అశోక్ కుమార్, విద్యాసాగర్, మాజీ వైస్ ఎంపీపీ షాకిర్ అలీ, మాజీ సర్పంచులు రాచయ్య, శాంసన్, మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం, కాంగ్రెస్ నాయకులు మునీర్ పటేల్, అష్రాఫ్, మాజిద్, జైరాజ్, ముర్జల్, అలెగ్జాండర్, ముజామ్మిల్ తదితరులు పాల్గొన్నారు.