నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడు పార్లపల్లి ముని కృష్ణారెడ్డి... నా బలం, బలహీనత ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే... మల్లంగుంట టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి పార్లపల్లి ముని కృష్ణారెడ్డి
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్
ఎన్నికలు జరిగిన జరగకపోయినా ఎప్పటినుంచో ఉదయం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంతవరకు ప్రజలే నా ప్రాణం... పంచాయతీ ప్రజల కోసం ఏమి చేయడానికైనా సిద్ధం.. అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు ఇప్పించడమే తన లక్ష్యం. ఇప్పటికే పదవి ఉన్నా లేకపోయినా గ్రామాభివృద్ధి ద్యేయంగా మల్లంగుంట గ్రామపంచాయతీలో నాలుగు కోట్ల రూపాయల నిధులతో సిసి రోడ్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇక పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా పార్లపల్లి మునికృష్ణారెడ్డిని గెలిపిస్తే పంచాయతీలోని ప్రజలందరికీ కావలసిన మౌలిక సదుపాయాలతో కల్పిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. టిడిపి మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న మునికృష్ణారెడ్డిని ఆదరించి గెలిపించాలని ఆయన పంచాయితీ ప్రజలను కోరుతున్నారు.
1. సర్పంచ్ గా ఎన్నికైతే మీరు ఐదేళ్లలో గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు..?
ముని కృష్ణారెడ్డి: పంచాయతీలోని ప్రజలందరికీ మౌలిక సదుపాయాలను కల్పించడం, ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసా కల్పించడమే నా ధ్యేయం. అస్తవ్యస్తంగా ఉన్న ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థను మార్పు చేసి అండర్ డ్రైనేజీ వ్యవస్థను రూపొందిస్తా. దోమలు, ఇతర అంటువ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు వైద్య ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. పంచాయతీ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులు లాగా భావించి నిత్యం వారి సేవలో కొనసాగడమే నా లక్ష్యం.
2. గ్రామంలో రోడ్లు తాగునీడు డ్రైనేజీ వీధి దీపాలు పారిశుద్ధ్యం సమస్యల పరిష్కారానికి ఎలాంటి కార్యాచరణ చేపడతారు?
ముని కృష్ణారెడ్డి : పంచాయతీ పరిధిలోని కృష్ణారెడ్డి కాలనీ హరిజనవాడ, మల్లంగుంట మెయిన్ గ్రామంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటిని కొత్త రోడ్లు వేస్తాం. సుమారు 20 ఏళ్ల క్రితం రోడ్లు వేయడంతో అవన్నీ పగుళ్లు ఏర్పడి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. నిత్యం పంచాయతీలోని అన్ని కాలనీలలో పర్యటించి ఎక్కడైనా తాగునీటి సమస్య ఉన్న ఇతర ఏ సమస్యలను ఉంటే పరిష్కరించడమే తన లక్ష్యం.
3. పంచాయతీకి వచ్చే ప్రభుత్వ నిధులను అవినీతికి తావు లేకుండా పాలన అందించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ముని కృష్ణారెడ్డి: నా పంచాయతీలో అవినీతి రహిత పాలన అందించడమే తన ధ్యేయం. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయికి జవాబుధారితనంగా ఉంటా. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు మాత్రమే నిధులను ఖర్చు చేస్తాం.
4. మీ ప్రత్యర్థి అభ్యర్థితో పోలిస్తే గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు సర్పంచ్ గా ఎన్నుకోవాలి మీ ప్రత్యేకత ఏమిటి?
ముని కృష్ణారెడ్డి : తాను పదవిలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తాను ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో పంచాయతీలో నాలుగు కోట్ల రూపాయలతో డబుల్ రోడ్లను వేయించడం జరిగింది. పంచాయతీలోని 60 మంది పేదలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో చిందేపల్లి వద్ద పట్టాలు ఇచ్చారు. వారికి స్థలాలు చూపలేదు వారందరికీ పంచాయతీలోనే స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. పార్టీలకతీతంగా పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలకు అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు ఇప్పించడం, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి హయాంలో రిక్షా కాలనీలోని పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపలేదు. వారందరికీ తాను సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకువెళ్లి ఇంటి స్థలాలు ఇవ్వడమే మొదటి కర్తవ్యం.
పంచాయతీలో ఇంటి స్థలం లేని అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇళ్లను నిర్మించి ఇవ్వడమే తన బాధ్యత. మొదటి ప్రాధాన్యత.
నిత్యం ప్రజల్లో ఉండే ప్రజల మనిషిగా ఎవరికి ఏ సాయం కావాలన్నా, పంచాయతీలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చిన తానున్నానంటూ భరోసా కల్పించడం.
తన ను నమ్ముకున్న ప్రజలకు నిత్యం వారి వెన్నంటే ఉండి సాయం అందించడమే తన ధ్యేయం. నిత్యం ప్రజలతో ఉండటం వల్లనే ప్రజల మనిషిగా గ్రామంలో గుర్తింపు తెచ్చుకున్నారు. కావున మల్లం గుంట గ్రామపంచాయతీ ప్రజలందరూ ఆలోచించి పంచాయతీకి బంగారు భవిష్యత్తు కావాలంటే సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న పార్లపల్లి మునికృష్ణారెడ్డి ని ఆదరించి ఓట్లేసి గెలిపించాలని ముని కృష్ణారెడ్డి ఓటర్లను కోరుతున్నారు.
H. Dwaraka, staff reporter
9705347341