ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఉంగరాల శైలజ
ఉండి, మేజర్ న్యూస్: ఉండి మండలం చెరుకువాడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఉంగరాల శైలజ నాగేశ్వరరావు గ్రామ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజల నుండి ఆమెకు విశేష స్పందన ఆదరణ లభించిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నానని ప్రతి సమస్యను తెలుసుకుని దానిపై అవగాహన పెంచుకొని పరిష్కరిస్తానని ఆమె అన్నారు మహిళల నుండి విశేష స్పందన వస్తుందని హారతులతో ఎదురు వస్తున్నారని ఆమె తెలిపారు చెరుకువాడ గ్రామ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ప్రతి ఒక్కరు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఓటు వేసే బాధ్యత మీరు తీసుకుంటే గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.