నిరుపేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం...!
మర్రిగూడ, మేజర్ న్యూస్; కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని శివన్నగూడ గ్రామ సర్పంచ్ రాపోలు యాదగిరి అన్నారు.బుధవారం మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా చేయూత పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేసి ఆయన మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద ప్రజలకు కూడు గూడు చేయూత భరోసా లాంటి పథకాలను అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.