పశుగ్రాసం కొరత నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పశువుల దాహార్తి తీర్చేందుకు పశువుల తొట్ల నిర్మాణం చేపట్టాలి
రామాయంపేట ; :భవిష్యత్తులో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కన్నపేట గ్రామసభ పశువైద్యాధికారి శ్రీనివాస్ సూచించారు. పశువులకు అవసరమైన పచ్చిమేతను అందుబాటులో ఉంచుకునేందుకు పశుగ్రాస పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.అదేవిధంగా వేసవిలో పశువులకు నీటి కొరత ఏర్పడకుండా వాటి దాహార్తిని తీర్చేందుకు పశువుల తొట్లలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పశువులకు సరిపడా పచ్చిమేత, స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. పశుసంపదను కాపాడుకోవడంతో పాటు పాడి రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని పశువైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కయ్య గారు యాదగిరి తహసిల్దార్ రజనీకుమారి ఎంపీడీవో సలావుద్దీన్ విద్యుత్ శాఖ ఏ ఈ తిరుపతి రెడ్డి తోపాటు గ్రామ ప్రజ లు తదితరులు పాల్గొన్నారు