BREAKING
పలిమెల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు నాగ్సన్ పల్లిలో చేయూత పింఛన్ల పంపిణీ పేదలకు భరోసాగా చేయూత పింఛన్లు నేడే ప్రారంభమైన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీఓ.. సబ్‌స్క్రైబ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు! మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం.. 200 సైలెన్సర్లు రోడ్డు రోలర్‌తో ధ్వంసం నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడు పార్లపల్లి ముని కృష్ణారెడ్డి... నా బలం, బలహీనత ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే... మల్లంగుంట టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి పార్లపల్లి ముని కృష్ణారెడ్డి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి ఫోకస్‌లో పూనావాలా ఫిన్‌కార్ప్ బలమైన RoA, మెరుగైన లాభదాయకత అంచనాలతో బుల్లిష్‌గా మోతీలాల్ ఓస్వాల్! టార్గెట్ ధర ఎంతంటే? నూతన అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి పనుల్లో సర్పంచ్ అభ్యర్థి తొలి అడుగు సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ - లబ్ధిదారుల మొహంలో ఆనందం విద్యార్థుల బియ్యంపై నైట్ వాచ్ మెన్ కన్ను...! ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఉంగరాల శైలజ లైన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి వారి ఆధ్వర్యంలో, వ్యాసరచన పోటీలు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్

అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలి **కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మేలు.. ఎమ్మెల్యే అంజిబాబు**

Select Suryaa Now
అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలి  **కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మేలు.. ఎమ్మెల్యే అంజిబాబు**

భీమవరం, మేజర్ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) కోరారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలు కూటమి అభ్యర్థులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

బుధవారం భీమవరం పట్టణంలోని 7, 8, 9, 10వ వార్డుల్లో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ చుండూరి మల్లేశ్వరితో కలిసి ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు గూడూరి రామకృష్ణ, చెల్లబోయిన వెంకటలక్ష్మి, కలిదిండి వినోద్ వర్మ, బొత్స వెంకటరమణలకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుని కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.

తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు.

చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ భీమవరం పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు ఒక్క అవకాశం కల్పించాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.