ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి
రామాయంపేట :; రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో బుధవారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ మానేగల రామకృష్ణయ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణయ్య తహసిల్దార్ రజిని కుమారి ఎంపీడీవో సలావుద్దీన్ మాట్లాడుతూ ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులపై గ్రామస్తులకు, రైతులకు అవగాహన కల్పించారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వ్యవసాయ సాగులో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక చేసుకోవాలని, వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేసుకొని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.
ఈ గ్రామసభలో గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. గ్రామస్తులు, రైతులు ఈ అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రామకృష్ణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏ ఈ తిరుపతిరెడ్డి వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ తోపాటు గ్రామ ఉపసర్పంచ్ మహేష్ వార్డు సభ్యు లు శాలిపేట సిద్ధరాములు రవితేజ వానప్పగారు సుధాకర్ రెడ్డి సాలమన్ సాకలి పోచయ్య ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్ర తోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు