BREAKING
పలిమెల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు నాగ్సన్ పల్లిలో చేయూత పింఛన్ల పంపిణీ పేదలకు భరోసాగా చేయూత పింఛన్లు నేడే ప్రారంభమైన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీఓ.. సబ్‌స్క్రైబ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు! మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం.. 200 సైలెన్సర్లు రోడ్డు రోలర్‌తో ధ్వంసం నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడు పార్లపల్లి ముని కృష్ణారెడ్డి... నా బలం, బలహీనత ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే... మల్లంగుంట టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి పార్లపల్లి ముని కృష్ణారెడ్డి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి ఫోకస్‌లో పూనావాలా ఫిన్‌కార్ప్ బలమైన RoA, మెరుగైన లాభదాయకత అంచనాలతో బుల్లిష్‌గా మోతీలాల్ ఓస్వాల్! టార్గెట్ ధర ఎంతంటే? నూతన అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి పనుల్లో సర్పంచ్ అభ్యర్థి తొలి అడుగు సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ - లబ్ధిదారుల మొహంలో ఆనందం విద్యార్థుల బియ్యంపై నైట్ వాచ్ మెన్ కన్ను...! ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఉంగరాల శైలజ లైన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి వారి ఆధ్వర్యంలో, వ్యాసరచన పోటీలు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్

విద్యార్థినుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహనే లక్ష్యం....

Select Suryaa Now
విద్యార్థినుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహనే లక్ష్యం....

నర్సాపూర్ ; నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం  రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు 400 శానిటరీ కిట్లను  నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి  ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్  డా. శైలజా రెడ్డి ల చేతుల మీదుగా విద్యార్థినులకు శానిటరీ కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి  మాట్లాడుతూ..మహిళల ఆరోగ్యం, ఆడపిల్లల ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికీ ముఖ్యమని, రుతుక్రమం అనేది సహజమైన ప్రక్రియ అని, దానిపై  సంకోచం కాకుండా సరైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థినిలకు సూచించారు. అనంతరం డా. శైలజా రెడ్డి  మాట్లాడుతూ.. విద్యార్థినుల్లో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ అవసరమైన పరిశుభ్రత ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రుతుక్రమం సిగ్గుపడాల్సిన విషయం కాదు.. ప్రతి బాలిక ఆరోగ్యానికి అవసరమైన సహజ ప్రక్రియ. ప్రతి విద్యార్థినికి ఆరోగ్యం, గౌరవం, ఆత్మవిశ్వాసం అందించడమే మా లక్ష్యం" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు మహిళా సాధికారత, సామాజిక బాధ్యత పట్ల రాజన్న ఫౌండేషన్ తన నిబద్ధతను చాటుకుంది.రాజన్న ఫౌండేషన్
సమాజ సేవే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాచునూరి లక్ష్మీరాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రాల మల్లేశం కౌన్సిలర్లు నరసమ్మ రవి సరిత ఆంజనేయులు గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేఘమాల కిషన్ మాజీ ఎంపీపీ లలితా నర్సింగ్ నాయక్  సర్పంచ్ ప్యాట  సరిత మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.