BREAKING
పలిమెల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు నాగ్సన్ పల్లిలో చేయూత పింఛన్ల పంపిణీ పేదలకు భరోసాగా చేయూత పింఛన్లు నేడే ప్రారంభమైన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీఓ.. సబ్‌స్క్రైబ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు! మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం.. 200 సైలెన్సర్లు రోడ్డు రోలర్‌తో ధ్వంసం నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడు పార్లపల్లి ముని కృష్ణారెడ్డి... నా బలం, బలహీనత ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే... మల్లంగుంట టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి పార్లపల్లి ముని కృష్ణారెడ్డి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి ఫోకస్‌లో పూనావాలా ఫిన్‌కార్ప్ బలమైన RoA, మెరుగైన లాభదాయకత అంచనాలతో బుల్లిష్‌గా మోతీలాల్ ఓస్వాల్! టార్గెట్ ధర ఎంతంటే? నూతన అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి పనుల్లో సర్పంచ్ అభ్యర్థి తొలి అడుగు సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ - లబ్ధిదారుల మొహంలో ఆనందం విద్యార్థుల బియ్యంపై నైట్ వాచ్ మెన్ కన్ను...! ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఉంగరాల శైలజ లైన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి వారి ఆధ్వర్యంలో, వ్యాసరచన పోటీలు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్

వలిగొండలో పింఛన్ల పండుగ* *-1,105 మందికి

Select Suryaa Now
వలిగొండలో పింఛన్ల పండుగ* *-1,105 మందికి

చేయూత పింఛన్లు మంజూరు..
-లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం*

*వలిగొండ,మేజర్ న్యూస్*

*అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. వలిగొండ మండలంలో నూతనంగా మంజూరైన 1,105 చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను బుధవారం సాయి గణేష్ ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పింఛన్ల కోసం అర్హులు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఎంతోమంది అర్హులకు పింఛన్లు అందించడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందన్నారు. భువనగిరి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*