BREAKING
వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్ చేయూత పింఛన్లతో పేదల కళ్ళల్లో ఆనందం.. లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.. యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు: మూగజీవాలపై అకృత్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ నటి నిరుపేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం...! జంగారెడ్డిగూడెం బిలాల్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ గా నజీర్ భాషా ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి వలిగొండలో పింఛన్ల పండుగ* *-1,105 మందికి పశుగ్రాసం కొరత నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పశువుల దాహార్తి తీర్చేందుకు పశువుల తొట్ల నిర్మాణం చేపట్టాలి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గణపతి హోమం .... అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలి **కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మేలు.. ఎమ్మెల్యే అంజిబాబు** విద్యార్థినుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహనే లక్ష్యం.... ధనుష్ ఓమ్ మూవీకి యు బై ఏ సర్టిఫికేట్: ఉదయం ఆరు గంటల షోలకు అనుమతి ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్‌కు హీరో కృతజ్ఞతలు జిల్లా బిజెపి అధ్యక్షురాలి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోణం విట్టల్. దొడ్డిపట్ల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం **జనసేనలో చేరిన ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు.. సర్పంచ్ అభ్యర్థిగా తల్లి ఉమారాణి** ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఎంపీడీవో షాకీర్ అలీ..

అయ్యప్ప భక్తులకు మిట్టపల్లి వెంకటేష్ భారీ కానుక

Select Suryaa Now
అయ్యప్ప భక్తులకు మిట్టపల్లి వెంకటేష్ భారీ కానుక

 మిర్యాలగూడ,మేజర్ న్యూస్ :శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనార్థం వెళ్లే మిర్యాలగూడ నియోజక వర్గ అయ్యప్ప మాల ధారణ స్వాముల సౌకర్యార్థం మిట్టపల్లి వెంకటేష్ టీం ఆధ్వర్యం లో  ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రముఖ పారిశ్రామికవేత్త,మిట్టపల్లి వెంకటేష్ తెలిపారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో మిట్టపల్లి వెంకటేష్ మాట్లాడుతూ మిట్టపల్లి వెంకటేష్ టీం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు మిర్యాలగూడ నియోజకవర్గంలోని అయ్యప్పస్వాములుఈసదవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తి గా కోరుతున్నట్లు అయన తెలిపారు. ప్రతి సంవత్సరం మాలధారణ వేసుకున్న స్వాములు శబరిమలై యాత్రకు వెళ్లేందుకు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని,టిక్కెట్లు దొరకక పోవడం, ఎక్కువ ఖర్చు కావడం, సమయానికి రైలు అందకపోవడం వంటి సమస్యలతోసతమతమవు తుంటారని అయన తెలిపారు. అయ్యప్ప స్వాములు పడుతున్న ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో ఉంచుకొనిమిర్యాలగూడ నియోజక వర్గంలోని అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేకంగా ఈ రైలు ఏర్పాటు చేస్తున్నట్లు మిట్టపల్లి తెలిపారు.
డిసెంబర్ 22 న మిర్యాలగూడ నుండి చెంగనూర్ కు ప్రత్యేక రైలు ప్రయాణం ప్రారంభమవుతుందని తిరుగు ప్రయాణం డిసెంబర్ 25వ న చెంగనూర్ నుండి మిర్యాలగూడ కుకొనసాగుతుందన్నారు.అయ్యప్ప భక్తులకు ప్రత్యేక సౌకర్యంగా సుమారు 1,000 నుండి 1,200 మంది స్వాములు ప్రయాణించేందు కు సౌకర్యం కల్పించడంజరుగుతుం దన్నారు.అయ్యప్ప స్వాములు అందరూ కలిసి ఒకే రైలులో ప్రయాణం చేయడం వలన శబరిమలై యాత్ర మరింత భక్తిభావంతో, సంతోషంగా, సురక్షితంగా సాగుతుందని వెంకటేష్ అభిప్రాయపడ్డారు. మార్గమధ్యంలో స్వాములకు అవసరమైన సౌకర్యాలు, తాగునీరు, భోజన ఏర్పాట్లపై  ప్రత్యేకశ్రద్ధతీసుకుంటున్నట్లుఅయన తెలిపారు.అయ్యప్ప స్వాముల రైలు ప్రయాణ ఖర్చులన్నీ తమ సొంత నిధుల నుండి భరించను న్నట్లు మిట్టపల్లి వెంకటేష్ తెలిపారు .అయ్యప్ప స్వామి భక్తులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చూడాలనే సేవా భావంతో, భక్తి శ్రద్ధలతో ఈ ప్రత్యేక రైలు యాత్రను నిర్వహిస్తున్నానని , అయ్యప్ప స్వామి సేవే తమకు అదృష్టంగా భావిస్తున్నానని మిట్టపల్లి వెంకటేష్ తెలిపారు.  మిర్యాలగూడ నియోజక వర్గంలోని ప్రతి అయ్యప్ప స్వామి మాలధారణ స్వాములు ఈ పవిత్ర యాత్ర సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలనిఅయన మనవి చేశారు. ప్రత్యేక రైలులో  సీట్లు పరిమితంగా ఉన్నందున ముందుగా నమోదు చేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అయన స్పష్టం చేశారు. ప్రత్యేక రైలు సీట్ల నమోదు కోసం ఈనెల 18 నుండి 28 లోపు మీ ఆధార్ కార్డు ,సెల్ ఫోన్ నెంబర్ , పేరు పూర్తి వివరాలు  మిర్యాలగూడ పట్టణం వైదేహి టౌన్ షిప్ లోని మాస్వగృహంలో అందజేయాలని కోరారు. ఇతర సమాచారం కోసం 8142782580, 9014592580. నవంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ ప్రత్యేక రైలు యాత్రలో పాల్గొనే స్వాములందరూ క్రమశిక్షణతో, భక్తిభావంతో మెలగాలని, ఒకరి కొకరు సహకరించుకుంటూ యాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.