BREAKING
వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్ చేయూత పింఛన్లతో పేదల కళ్ళల్లో ఆనందం.. లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.. యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు: మూగజీవాలపై అకృత్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ నటి నిరుపేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం...! జంగారెడ్డిగూడెం బిలాల్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ గా నజీర్ భాషా ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి వలిగొండలో పింఛన్ల పండుగ* *-1,105 మందికి పశుగ్రాసం కొరత నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పశువుల దాహార్తి తీర్చేందుకు పశువుల తొట్ల నిర్మాణం చేపట్టాలి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గణపతి హోమం .... అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలి **కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మేలు.. ఎమ్మెల్యే అంజిబాబు** విద్యార్థినుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహనే లక్ష్యం.... ధనుష్ ఓమ్ మూవీకి యు బై ఏ సర్టిఫికేట్: ఉదయం ఆరు గంటల షోలకు అనుమతి ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్‌కు హీరో కృతజ్ఞతలు జిల్లా బిజెపి అధ్యక్షురాలి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోణం విట్టల్. దొడ్డిపట్ల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం **జనసేనలో చేరిన ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు.. సర్పంచ్ అభ్యర్థిగా తల్లి ఉమారాణి** ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఎంపీడీవో షాకీర్ అలీ..

నిద్రావస్తా లేక మామూళ్ళ మాత్తా అన్నట్టు ఎక్సయిజ్ అధికారుల తీరు

Select Suryaa Now
నిద్రావస్తా లేక మామూళ్ళ మాత్తా అన్నట్టు ఎక్సయిజ్ అధికారుల తీరు

పెద్దశంకరంపేట : మండలంలో మద్యం దుకాణాల నిర్వహణలో నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో పత్రికల్లో వరస కథనాలు వెలువడుతున్న  సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్స్‌ దుకాణాల నిబంధనల ఉల్లంఘన, బెల్ట్‌ షాపుల విచ్చలవిడి నిర్వహణ, పర్మిట్‌ రూముల పేరుతో జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్‌, బస్టాండ్‌ సమీపంలో వైన్స్‌ నిర్వహణ!

నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు, ప్రజా రవాణా ప్రాంతాల సమీపంలో మద్యం దుకాణాల ఏర్పాటు విషయంలో పాటించాల్సిన దూర పరిమితులు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా వైన్స్‌ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, మహిళలు, ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మద్యం విక్రయాలు కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు మద్యం మత్తులో కన్న తల్లినే కడతేర్చిన తనయుడు

మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామాల్లో బెల్ట్‌ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి విచ్చాలవిడిగా అనధికారికంగా మద్యం విక్రయాలు సాగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం పెరిగి కుటుంబ కలహాలు, గొడవలు, ఇతర అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఏర్పడుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మండల పరిధిలోని శివాయపల్లి గ్రామం లో మద్యం మత్తులో కన్న తల్లినే రోకలి బండతో తల పగలగొట్టి హత్య చేసిన సంఘటన మొన్న సోమవారం రాత్రి చోటు చేసుకుంది గతంలో చోటుచేసుకున్న పలు దురదృష్టకర సంఘటనల కారణంగా  వాటిని దృష్టిలో ఉంచుకొని  మద్యం విక్రయాల నియంత్రణ ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి.

పర్మిట్‌ రూముల నిబంధనలు గాలికి!

వైన్స్‌లకు అనుబంధంగా నిర్వహిస్తున్న పర్మిట్‌ రూముల్లోనూ నిబంధనలు పూర్తిగా పక్కదారి పట్టాయి. కేవలం మంచి నీటి సౌకర్యం మాత్రం కల్పించాల్సిన పర్మిట్ రూమ్ లలో మద్యం ప్రియులకి వైన్స్ నిర్వాహకులు తమ స్వలాభం కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు అనుమతుల పరిధి, పరిశుభ్రత, వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాలు, నిర్ణీత సమయాల పాటింపు వంటి అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది

కథనాలు వచ్చినా కదలని యంత్రాంగం!

ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, వార్తా కథనాలను అధికారులు కనీసం పరిగణనలోకి తీసుకుంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యంత్రాంగం నిద్రవస్థలో ఉందా లేక మామూళ్ళ మత్తులో ఉందొ తెలియని పరిస్థితి 
ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని వైన్స్‌ దుకాణాలు, పర్మిట్‌ రూములు, గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్‌ షాపులపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలపై ప్రత్యేకంగా పరిశీలన జరిపి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.