BREAKING
జిల్లా బిజెపి అధ్యక్షురాలి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోణం విట్టల్. దొడ్డిపట్ల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం **జనసేనలో చేరిన ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు.. సర్పంచ్ అభ్యర్థిగా తల్లి ఉమారాణి** ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఎంపీడీవో షాకీర్ అలీ.. యే ప్రేమ్ మోల్ లియా ట్రైలర్: పెళ్లి తర్వాత అమ్మాయి ఇల్లు వదలాలనే సాంప్రదాయానికి సవాల్ విసురుతున్న ఆయుష్మాన్ ఖురానా, శర్వరి లవ్ స్టోరీ ఛలో సిద్దిపేట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ... నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి .... నిద్రావస్తా లేక మామూళ్ళ మాత్తా అన్నట్టు ఎక్సయిజ్ అధికారుల తీరు ఋషికేశ్ 6 వ వర్ధంతి సందర్భంగా సాధన మానసిక వికలాంగుల కు అన్నదానం* కళ్యాణదుర్గం డివిజన్లో 10 మండలాలకు గాను 4772 నామినేషన్లు స్వీకరణ. చేయూతత ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అయ్యప్ప భక్తులకు మిట్టపల్లి వెంకటేష్ భారీ కానుక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా లబ్దిదారులను గుర్తించాలి మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ వన్ టౌన్ సీఐని కలిసిన 47వ వార్డ్ కౌన్సిలర్ రెడ్డి కేశవ : టిడిపి నాయకులతో కలిసి ఘనసన్మానం హనుమంతరావును పరామర్శించిన ఎమ్మెల్యే ఏలూరి ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలి తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడు.. ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు!

ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలి తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్

Select Suryaa Now
ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలి  తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్

తూప్రాన్; ; బాలికలు ఆత్మ రక్షణతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ తెలిపారు .తూప్రాన్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా, అప్రమత్తంగా వ్యవహరించాలని, తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఆపద సమయంలో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని వివరించారు.అదేవిధంగా విద్యార్థినులు తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని, ఇతరులపై ఆధారపడకుండా తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎంఈఓ  సత్యనారాయణ , ఎస్సై గంగరాజు ఎస్ఐ జ్యోతి, షీ టీమ్ సభ్యురాలు స్వరూప, పోలీసు సిబ్బంది మరియు పాఠశాల అధ్యాపకురాలు పాల్గొన్నారు.అనంతరం కరాటే శిక్షకులు భిక్షపతి మరియు నైనీష విద్యార్థినులకు ఆత్మరక్షణకు సంబంధించిన వివిధ పద్ధతులపై ప్రాక్టికల్ డెమో ప్రదర్శించి, ఆపద సమయాల్లో వాటిని ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు.