అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : గ్రంధాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేసి.. సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ పిలుపునిచ్చారు. 59వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం
జిల్లా కేంద్ర గ్రంధాలయంలో.. ఐదవ రోజు గ్రంథపాలకుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. సభాధ్యక్షులుగా జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి జె శివప్రసాద్ వహించగా, ముఖ్య అతిథి గా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ హాజరయ్యారు.ఈ సందర్బంగా శాఖలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి ఉత్తమ గ్రంధాలయ అధికారి అవార్డు ను ప్రధానం చేసారు. వీరిలో ఏఏం శ్రీపతి అనంతపురం మహిళా గ్రంధాలయం గ్రంధాలయాధికారి, సత్యంబాబు మడకశిర రికార్డు అసిస్టెంట్, రాయదుర్గం సిబ్బంది రికార్డు అసిస్టెంట్ జి. సత్యనారాయణ చైర్మన్ శాలువా కప్పి మేమెంటో అందచేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా చైర్మన్ వడ్డే వెంకట్ మాట్లాడుతూ గ్రంధాలయ సిబ్బంది అందరు క్రమశిక్షణ తో పనిచేసి సంస్థ కు మంచిపేరు తేవాలని కోరారు.ఈ సందర్బంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ ఉత్తమ సిబ్బంది కి అవార్డులు ప్రధానం చేయడం ప్రధానం చేయడం పట్ల గ్రంధాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ , కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ గ్రంధాలయాధికారి పి కమ్మన్న, సహా గ్రంధాలయాధికారి డి గోవిందు కార్యాలయ సిబ్బంది రామాంజినమ్మ, కిరణ్, జీవన,ముత్యాలమ్మ, ఇందిరమ్మ,శిరీషా, సరస్వతమ్మ శ్రీవిజయ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.