ఒక్కరోజులోనే కలెక్టరేట్ గ్రంథాలయానికి 209 పుస్తకాలు
బాపట్ల, మేజర్‌న్యూస్ :
ఉద్యోగుల్లో పఠనాసక్తిని పెంపొందించి, విజ్ఞానాభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి.,పిలుపుతో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి బుధవారం ఒక్కరోజే 209 పుస్తకాల ను వివిధ శాఖల అధికారులు అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస సింగ్, రేపల్లె ఆర్డీఓ బి. శ్రీదేవి, ఎన్నికల సెల్ పర్యవేక్షకుడు షఫీ, తహశీల్దార్లు గోపీకృష్ణ, పార్వతి, సుశీల, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, జిల్లా రెడ్‌క్రాస్ అధ్యక్షుడు నారాయణ భట్టు సూపరింటెండెంట్, ఎల్.ఏ. సెక్షన్ జె. శ్రీలక్ష్మి, డా. మనోజ్ ప్రదీప్ కుమార్ (డీపీఎంఓ, ఎన్‌హెచ్‌ఎం), సర్వశిక్ష అభియాన్ పీఓ శ్రీనివాసులు డ్రైన్ డి ఈ ధనలక్ష్మి పుస్తకాలు బహుకరించారు. డ్రైనే ఈఈ ప్రేమ్‌కుమార్ రూ.2,000, వయోజన విద్య డీడీ ఆంజనేయులు రూ.1,000 విరాళంగా అందజేశారు. పుస్తకాలు, విరాళాలు అందించిన వారిని కలెక్టర్ అభినందించారు. గ్రంథాలయ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛందంగా పుస్తకాలు అందించి పఠన సంస్కృతిని ప్రోత్సహించాలని కోరారు.