దేవాంగపురి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఉదయ్ కుమారి
దేవాంగపురి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఉదయ్ కుమారి
- అభ్యర్థిని ప్రకటించిన ఎమ్మెల్యే కొండయ్య
- చీరాల : చీరాల మండలం దేవాంగపురి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పృథ్వీ లలిత మోహన్ భార్య పృథ్వీ ఉదయ్ కుమారిని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఖరారు చేశారు. టిడిపి సీనియర్ నాయకులు సిద్ధి బుచ్చేశ్వరరావు స్వగృహం వద్ద ఆమె అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా ఉదయ్ కుమారి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు.