11 వ వార్డు లో జోరందుకున్న టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల. నాగమణి ఇంటింటి ప్రచారం
పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆశీస్సులతో 11వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిమ్మకాయల. నాగమణి ఇంటింటి తిరిగి ప్రచారం నిర్వహించారు.పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసిన చైర్మన్ మరియు వార్డు కౌన్సిలర్ గుర్తు సైకిల్ గుర్తు పై ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.వార్డులో ఉన్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దృష్టికి తీసుకోని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి. వాసు టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్