అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..
*-రాజపేట మండలంలో 748 మంది కి కొత్త చేయూత పింఛన్లు*
*- లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య*
రాజపేట, మేజర్ న్యూస్: అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. రాజపేట మండల కేంద్రంలోని మీనాక్షి ఫంక్షన్‌హాల్‌లో బుధవారం 748 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులు, ఒంటరి మహిళలు,నేత,గీత, నిరుపేదలకు చేయూత పింఛన్లు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. పింఛను కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, గౌరవప్రదమైన జీవనానికి భరోసా అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పింఛను మొత్తాన్ని నిత్యావసరాలు, వైద్య ఖర్చులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.