కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలకు ICAR గుర్తింపు
సి.యస్ పురం, మేజర్‌న్యూస్ :
సియస్ పురం కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలకు భారత పరిశోధన మండలి (ICAR,న్యూ ఢిల్లీ) గుర్తింపు లభించిది.బుధవారం కళాశాల లో కళాశాల చైర్మన్ కె వి ప్రకాశ్ రావు, సెక్రటరీ కరెస్పాండంట్ కదిరి పార్ధసారధి, కళాశాల డీన్ డాక్టర్ కె మోషే,అధ్యాపకులు, విద్యార్థుల మద్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
25 అక్టోబర్ 2026న జరిగిన తన 44వ సమావేశంలో జాతీయ వ్యవసాయ విద్యా గుర్తింపు బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం, ప్రకాశం జిల్లా, కనిగిరి, సి.ఎస్.పురంలోని ఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల మరియు బి.ఎస్.సి. (ఆనర్స్) వ్యవసాయ కార్యక్రమానికి 25.10.2026 నుండి 24.10.2031 వరకు ఐదు సంవత్సరాల కాలానికి ఐ.సి.ఆర్ గుర్తింపు కోసం ఆమోదం లభించింది.ఈ సందర్భంగా పార్ధసారధి, ప్రకాశ్ రావు గారికి అధ్యాపకులు, విద్యార్థులలు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీలు మునగల నారాయణ రెడ్డి, మూరం కాశిరెడ్డి, తికణం బాబురావు,షేక్ నాయబ్ రసూల్, మూరం మస్తాన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.