BREAKING
కంబదూర్ లో పరోక్ష ఎన్నికకు సర్వం సిద్ధం. దేవాంగపురి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఉదయ్ కుమారి అన్నదాతకు సిరులు కురిపిస్తున్న వంకాయ సాగు : మానేవారిపల్లిలో రైతు మధునాయుడు భలే ఆదాయం : పంట దిగుబడి పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సుందరంగా ముస్తాబు చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి బ్రహ్మసముద్రం మండలం తీట కల్లులో 8కి 8 వార్డులు ఏకగ్రీవం, టిడిపి కైవాసం. అండుకొర్ర విత్తన నమూనాల సేకరణ నార్లపురంలో పొలంబడి పంటను పరిశీలించిన ఆర్గానిక్ ఇన్‌స్పెక్టర్ ఎన్టీపీసీ బూడిద రవాణాలో అక్రమ వసూళ్లు! - మూడేళ్లలో రూ.6 కోట్ల దోపిడి - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణలు 11 వ వార్డు లో జోరందుకున్న టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల. నాగమణి ఇంటింటి ప్రచారం కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి... - కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలి - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలకు ICAR గుర్తింపు బంగి నాగేంద్ర కు అనంత డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలి బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాలను పలు వైఎస్ఆర్సిపి వార్డులు ఏకగ్రీవం. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భద్రత... - నేటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భద్రత... - నేటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భద్రత...  - నేటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు

 

సూర్య - పెద్దపల్లి : అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. నవంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం కోసం జిల్లాలోని ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కుటుంబంలోని సంపాదించే సభ్యునికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడం ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే పథకం ఉద్దేశమన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు.
రేషన్ కార్డు లేని కుటుంబాలకు సైతం పథకంలో కొత్తగా నమోదు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. డేటా అందుబాటులో లేదనే కారణంతో ఏ ఒక్క అర్హుడినీ క్యాంపు నుంచి వెనక్కి పంపించరాదని ఆదేశించారు. క్యాంపుల్లో హెల్ప్ డెస్క్‌లు, అవసరమైన కౌంటర్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ప్రింటర్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
దరఖాస్తు సమయంలో బీమాదారుడి ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, రేషన్ కార్డు (ఉంటే), మొబైల్ నంబర్, నామినీ వివరాలు తీసుకురావాలని తెలిపారు. ప్రజలకు ముందుగానే క్యాంపుల తేదీలు, ప్రదేశాల వివరాలు తెలియజేసి డప్పు చాటింపు ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజూ దరఖాస్తుల పురోగతిపై నివేదిక సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీపీవో మాల, ఈడీఎం కవిత, ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.