అన్నదాతకు సిరులు కురిపిస్తున్న వంకాయ సాగు : మానేవారిపల్లిలో రైతు మధునాయుడు భలే ఆదాయం : పంట దిగుబడి పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతు
రామసముద్రం,మేజర్ న్యూస్ : వంకాయ సాగు రైతుకు సిరులు కురిపిస్తోంది.మదనపల్లి నియోజకవర్గం,రామసముద్రం మండల పరిధిలోని మానేవారిపల్లికి చెందిన రైతు మధు నాయుడు సాగు చేసిన వంకాయ పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడిని అందిస్తోంది.15 వేల వంకాయనారు నాటడంతో ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వంకాయ రూ.35 ధర పలుకుతుండటంతో రైతుకు ఆశాజనకమైన ఆదాయం లభిస్తోంది.పంటను ఎంతో శ్రద్ధతో సాగుచేయడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడి వస్తోంది.ఒకవైపు పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటం,మరోవైపు మార్కెట్‌లో మంచి ధర లభించడంతో మధు నాయుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కష్టపడి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తే రైతులకు ఎంతో ప్రోత్సాహం కలుగుతుందని ఈ సాగు నిరూపిస్తోంది.
రిపోర్టర్ : హరినాథ్,రామసముద్రం మండలం