జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సుందరంగా ముస్తాబు చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సుందరంగా ముస్తాబు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం పెయింటింగ్, మరమ్మతు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. జిల్లా పరిషత్ కార్యాలయం పరిపాలన విభాగం బాపట్ల జిల్లాకు రావడం, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుతుండగా కార్యాలయం భవనాన్ని సిద్ధం చేయాలన్నారు. జిల్లా పరిషత్ కు నూతన పాలకులు త్వరలో రానున్నారన్నారు. పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో జిల్లా పరిషత్ కార్యాలయ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఆర్డిఓ హరికుమార్, తహసిల్దార్ షాలిమా, తదితరులు ఉన్నారు.