BREAKING
ఆగ్నేయాసియా సైబర్ స్కామ్ కేంద్రాలపై అమెరికా ఆంక్షలు భర్త మత్తుమందు ఇచ్చి వేధించిన కేసు..నలుగురు బ్రిటన్ వ్యక్తులకు దోషిగా తీర్పు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాహారాలు.. మూత్రపిండాల రక్షణకు వైద్యుల సూచనలు! రెండేళ్ల వేతన స్తబ్ధత, పని గంటల సవరణకు వోక్స్‌వ్యాగన్ డిమాండ్ ఆఫ్రికాలో రష్యా 'ఏ7' చెల్లింపుల వ్యవస్థ విస్తరణ.. నైజీరియా, జింబాబ్వే తర్వాత మరిన్ని దేశాలపై మాస్కో దృష్టి! బుట్టాయిగూడెం మండల పరిషత్ అధ్యక్షులుగా కొమరం మల్లేశ్వర రావు ఇండోనేషియా–చైనా మధ్య 71.8 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాలు.. దేశవ్యాప్తంగా పది స్మార్ట్ సిటీల నిర్మాణం! శిలాజ ఇంధనాలు, ఏఐ విద్యుద్దీకరణపై కాప్31లో భిన్నాభిప్రాయాలు మహిళల భద్రత, ర్యాగింగ్ నిరోధం, మాదక దవ్యాల వలన జరిగే పరిణామాలపై అవగాహన గ్యాస్ ధరల పెరుగుదలతో జర్మనీ విద్యుత్ వ్యయం 16 బిలియన్ యూరోలు అదనం అమెరికా ఔషధ సంస్థ ఇన్‌స్మెడ్ కొనుగోలుపై సనోఫీ ఆలోచన వారణాసి క్రికెట్ స్టేడియం డమరుకం డిజైన్‌కు జై షా ఫిదా.. డిసెంబర్ నాటికి మ్యాచ్‌లకు సిద్ధం! ఎన్విడియా షేర్లలో ట్రంప్ పెట్టుబడులు.. తాజా నివేదికలో కీలక వివరాలు దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు!

ఎన్నికల విధుల్లో అధికారులు బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి

Select Suryaa Now
ఎన్నికల విధుల్లో అధికారులు బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలి :   జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి

బాపట్ల, మేజర్‌న్యూస్ :

ఎన్నికల విధుల్లో అధికారులు బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. ఎన్నికల సన్నద్ధత, ఓటరు నమోదు, MPTC–ZPTC పరోక్ష ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై  బుధవారం, కలెక్టరేట్ లోని బోర్డు రూం నుండి ఆయన మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మాట్లాడుతూ,జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రానున్న ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఓటరు నమోదు ఫారమ్స్ పెండింగ్‌లో ఉన్న వాటిని బి. ఎల్. ఓ., తహసీల్దార్, సంబంధిత ఎన్నికల అధికారుల స్థాయిలో సమీక్షించి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి తుది పరిష్కారం చూపాలన్నారు. ఫారమ్స్‌ను కేవలం ఒకరి లాగిన్ నుంచి మరొకరికి పంపకుండా, వాటి పరిష్కారానికి అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని  ఆయన స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు అయ్యేలా విస్తృత ప్రచారం చేపట్టాలని, అర్హులైన కొత్త ఓటర్ల దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిశీలించాలని ఆయన అన్నారు. 
ఓటరు జాబితా పరిశీలనలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ధృవీకరించి, అనర్హుల నమోదు, తప్పుడు వివరాలు, నివాస మార్పులకు సంబంధించిన అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలన్నారు.

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అధికారులకు సూచించారు. మండల విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయ సంఘాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ల అర్హతకు సంబంధించిన ధృవపత్రాలను జాగ్రత్తగా పరిశీలించి, సరైన ధృవీకరణ అనంతరం దరఖాస్తులను పరిష్కరించాలని ఆయన అన్నారు.ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోస్టల్ బ్యాలెట్, ఫెసిలిటేషన్ సెంటర్ల సౌకర్యాలను సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు సిబ్బందికి తెలపాలన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికారులు ఆదర్శంగా నిలిచి ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలన్నారు.


ఎంపీటీసీ, జడ్పీటీసీ  ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిబంధనలు, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ప్రమాణ స్వీకారం, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ప్రిసైడింగ్ అధికారులకు తెలిపారు. ఎన్నికల కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించి, ఎలాంటి గందరగోళం లేకుండా పూర్తి చేయాలన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారుల నియామకం, పోలింగ్ కేంద్రాల తనిఖీలు, మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ర్యాంపులు తదితర సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించి, లోపాలను తక్షణమే సరిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. తనిఖీ వివరాలను నిర్దేశించిన ఆన్‌లైన్ షీట్‌లో నమోదు చేయాలన్నారు.

ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బంది విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, సరైన కారణాలు లేకుండా విధులకు గైర్హాజరు కావడాన్ని ఉపేక్షించరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమర్థవంతంగా కేటాయించి, అవసరానికి మించి సిబ్బందిని నియమించకుండా వనరులను పొదుపుగా వినియోగించాలన్నారు.

ఎన్నికల ప్రక్రియలో అధికారులు పూర్తిగా నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. నామినేషన్ల పరిశీలన వంటి ప్రక్రియల్లో అనవసర వ్యక్తుల జోక్యాన్ని నివారించి, పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
ఎన్నికల సమయంలో అధికారులు తమ విధులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనవసర పర్యటనలు, ప్రోటోకాల్ కార్యక్రమాల వల్ల ఎన్నికల పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని తెలిపారు. ఎన్నికల రోజు సంబంధిత అధికారులు తమ కేంద్రాలు, మండలాల్లో అందుబాటులో ఉండి, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి రెవెన్యూ డివిజన్ అధికారి లవన్న, ఇంచార్జ్ జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ నాయక్, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ షేక్ షఫీ, వీక్షణ సమావేశం ద్వారా రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈఓ లు, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు ఇతర అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.