telangana
చెంజర్ల గ్రామంలో సంపూర్ణ ఆర్థిక సేవల కార్యక్రమం
సూర్య మానకొండూరు ;మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ సాచ్యురేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సాయి నిఖిల్ గారు బ్యాంకింగ్ సేవలు,బీమా, పెన్షన్ పథకాల గురించి వివరించారు.ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ తొర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఆన్‌లైన్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మొండయ్య, బ్యాంకు సిబ్బంది,గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.