BREAKING
వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్.. చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స 48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం

భక్తిశ్రద్ధలతో అన్నదానం.. అమ్మవారిని దర్శించుకున్న భద్రారెడ్డి

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో అన్నదానం.. అమ్మవారిని దర్శించుకున్న భద్రారెడ్డి

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(అక్టోబర్, 14):
వెంకటాపూర్‌లో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి మండపం వద్ద టీం బోరింగ్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తనయుడు డాక్టర్ చామకూర భద్రారెడ్డి ప్రారంభించారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి మండపం వద్ద భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక భావనతో పాటు సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన టీం బోరింగ్ సభ్యులను భద్రారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ బిఆర్ఎస్ నాయకులు సామల సందీప్ రెడ్డి, స్వాములు కందుల నవీన్ కుమార్ ముదిరాజ్, అందే అనంతరావు, నీరుడి శ్రీనివాస్, అందే శ్రీకాంత్, చిలుక గణేష్‌తో పాటు పలువురు స్వాములు పాల్గొన్నారు.

రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.