బీఆర్ఎస్ కార్యకర్త సైదులు కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక సాయం
బీఆర్ఎస్ కార్యకర్త సైదులు కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక సాయం
నేరేడుచర్ల, మేజర్ న్యూస్
నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సంక బుడ్డి సైదులు కుటుంబానికి హుజూర్నగర్ నియోజకవర్గ
బీఆర్ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు రూ.5000లు ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల సైదులు అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వారిని ఆదుకుంటామని పిల్లుట్ల రఘు భరోసా ఇచ్చారు. ఆయన ఆదేశానుసారం గురువారం కల్లూరు గ్రామానికి
బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడ్యా శ్రీను నాయక్ వెళ్లి సైదులు భార్య శివమ్మ కు నగదు అందజేశారు.హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పంగ శ్రీను,
బీఆర్ఎస్ నాయకులు జిలకర రామస్వామి, జింకల భాస్కర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, సైదులు, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.