BREAKING
జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం కుందుర్పి లో ఊపందుకున్న కూటమి ఎన్నికల ప్రచారం. బీఆర్ఎస్ కార్యకర్త సైదులు కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక సాయం 47వ వార్డులో హోరెత్తిన తెలుగుదేశం ప్రచారం : ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి అడగుడునా అపూర్వ స్వాగతం - టిడిపి అభ్యర్థి రెడ్డి కేశవులను గెలిపించాలని విజ్ఞప్తి మదనపల్లి టిడిపి ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు గెలుపే లక్ష్యం : కూటమి పార్టీల అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు - క్రిష్టియన్ పాస్టర్స్,టైలర్స్,ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అసోసియేషన్లు వెల్లడి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు ప్రత్యేక కేంద్రం: వెల్దుర్తి ఆర్‌వో ప్రకటన మాజీ సీఎం జగనన్న ఆదర్శమైన పాలన దేశానికే దిక్సూచి : వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా - 20,21 వార్డులలో షబానా,కరీముల్లాలకు మద్ధతుగా ప్రచారం ప్రత్యేక కార్యాచరణతో 32వ వార్డును అభివృద్ధి చేస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని తలారి రాధమ్మ వెల్లడి మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు. జిల్లా ఎస్పీ జగదీష్. బ్రహ్మాసముద్రం ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి...

మాజీ సీఎం జగనన్న ఆదర్శమైన పాలన దేశానికే దిక్సూచి : వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా - 20,21 వార్డులలో షబానా,కరీముల్లాలకు మద్ధతుగా ప్రచారం

Select Suryaa Now
మాజీ సీఎం జగనన్న ఆదర్శమైన పాలన దేశానికే దిక్సూచి : వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా - 20,21 వార్డులలో షబానా,కరీముల్లాలకు మద్ధతుగా ప్రచారం

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు నిదర్శనంగా నిలిచారని వైయస్సార్సీపి మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా పేర్కొన్నారు.మునిసిఫల్ ఎన్నికల్లో భాగంగా గురువారం 20వ వార్డు వైకాపా అభ్యర్థిని షేక్ షబానా,21వ వార్డు అభ్యర్థి ఎస్.ఏ కరీముల్లాలకు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ వైఎస్సార్సిపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ నవరత్నాలు పథకాలను అమలు చేసి ప్రతిఇంటికి సంక్షేమ ఫలాలను అందజేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు.వైకాపా 2019లో అధికారంలోకి వచ్చిన అనంతరం కరోనా మహమ్మారి విలయతాండవం చేసిందన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమచేశామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే,ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని నిలిపి వేసిందని తెలిపారు.రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలందరూ గమనించాలని ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.20,21 వార్డులలో వైకాపా తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు షేక్ షబానా,ఎస్.ఏ కరీముల్లాలు ప్రజాసమస్యల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తులని వారిని గెలిపిస్తే వార్డులను మరింత అభివృద్ధి చేస్తారన్నారు.అనంతరం ఎస్.ఏ కరీముల్లా మాట్లాడుతూ గతంలో మేము వార్డులో చేసిన అభివృద్ధిని చూసి మరో అవకాశం ఇవ్వాలన్నారు.వైయస్సార్సీపితోనే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.మా గెలుపు కోసం ప్రచారం చేయడానికి విచ్చేసిన వైకాపా రాష్ట్ర మైనార్టీ విభాగ అధ్యక్షులు ఖాదర్ బాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.నవంబర్ ఒకటో తేదీ జరిగే ఎన్నికల్లో వైకాపా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింకా చలపతికి,20,21 వార్డులలో మాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో యూనస్,ఇస్మాయిల్ ఖాన్,రమాదేవి పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి