పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు ప్రత్యేక కేంద్రం: వెల్దుర్తి ఆర్‌వో ప్రకటన
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:వెల్దుర్తి మండల పరిధిలో స్థానిక సంస్థల (ఎంపిటిసి/జెడ్పిటిసి) ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌వో) ఎన్. శ్రీధర్ తెలిపారు. కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు స్థానిక మండల ప్రజా పరిషత్ (ఎంపిడిఓ) కార్యాలయంలో ఈ ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వెల్దుర్తి మండలంలో ఓటు హక్కు కలిగి ఉండి, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అక్టోబరు 30 మరియు 31వ తేదీలలో ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్‌వో విజ్ఞప్తి చేశారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం