BREAKING
జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం కుందుర్పి లో ఊపందుకున్న కూటమి ఎన్నికల ప్రచారం. బీఆర్ఎస్ కార్యకర్త సైదులు కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక సాయం 47వ వార్డులో హోరెత్తిన తెలుగుదేశం ప్రచారం : ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి అడగుడునా అపూర్వ స్వాగతం - టిడిపి అభ్యర్థి రెడ్డి కేశవులను గెలిపించాలని విజ్ఞప్తి మదనపల్లి టిడిపి ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు గెలుపే లక్ష్యం : కూటమి పార్టీల అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు - క్రిష్టియన్ పాస్టర్స్,టైలర్స్,ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అసోసియేషన్లు వెల్లడి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు ప్రత్యేక కేంద్రం: వెల్దుర్తి ఆర్‌వో ప్రకటన మాజీ సీఎం జగనన్న ఆదర్శమైన పాలన దేశానికే దిక్సూచి : వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా - 20,21 వార్డులలో షబానా,కరీముల్లాలకు మద్ధతుగా ప్రచారం ప్రత్యేక కార్యాచరణతో 32వ వార్డును అభివృద్ధి చేస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని తలారి రాధమ్మ వెల్లడి మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు. జిల్లా ఎస్పీ జగదీష్. బ్రహ్మాసముద్రం ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి...

మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు. జిల్లా ఎస్పీ జగదీష్.

Select Suryaa Now
మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు. జిల్లా ఎస్పీ జగదీష్.

*అనంతపురం:** జిల్లాలో నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. ఎన్నికల బందోబస్తు విధులకు హాజరుకానున్న పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఐపీఎస్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. పోలింగ్ రోజున విధులు నిర్వహించాల్సిన తీరుతెన్నులు, పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. బందోబస్తు విధులకు వెళ్లే ప్రతి పోలీసు సిబ్బంది తప్పనిసరిగా పూర్తి యూనిఫాం, క్యాప్ ధరించి, లాఠీతో విధులకు హాజరుకావాలని ఎస్పీ ఆదేశించారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలు, విధులు, బాధ్యతలపై ముందుగానే పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విధుల్లో క్రమశిక్షణ, అప్రమత్తత పాటిస్తూ ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా ప్రజలు గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉన్న వ్యక్తుల గుర్తింపు కార్డులు, అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అర్హత కలిగిన వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. అనర్హులు లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులు ఏజెంట్లుగా ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించే అనుమతి కలిగిన వ్యక్తుల వద్ద నిషేధిత వస్తువులు లేకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశమున్న ప్రాంతాల్లో అదనపు అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిస్థితులను పర్యవేక్షించాలని తెలిపారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే పరిస్థితులు ఏర్పడినా సంబంధిత పోలీసు బృందాలు సమన్వయంతో తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఓటర్లను డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం, పోలింగ్‌కు ఆటంకం కలిగించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే సమాచారంపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ తెలిపారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అతీతంగా పూర్తిస్థాయి నిష్పక్షపాత ధోరణిని పాటించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని, ఓటర్లకు భద్రతపై నమ్మకం కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో పనిచేయాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ దిశానిర్దేశం చేశారు.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.