BREAKING
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం కుందుర్పి లో ఊపందుకున్న కూటమి ఎన్నికల ప్రచారం. బీఆర్ఎస్ కార్యకర్త సైదులు కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక సాయం 47వ వార్డులో హోరెత్తిన తెలుగుదేశం ప్రచారం : ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి అడగుడునా అపూర్వ స్వాగతం - టిడిపి అభ్యర్థి రెడ్డి కేశవులను గెలిపించాలని విజ్ఞప్తి మదనపల్లి టిడిపి ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు గెలుపే లక్ష్యం : కూటమి పార్టీల అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు - క్రిష్టియన్ పాస్టర్స్,టైలర్స్,ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అసోసియేషన్లు వెల్లడి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు ప్రత్యేక కేంద్రం: వెల్దుర్తి ఆర్‌వో ప్రకటన మాజీ సీఎం జగనన్న ఆదర్శమైన పాలన దేశానికే దిక్సూచి : వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా - 20,21 వార్డులలో షబానా,కరీముల్లాలకు మద్ధతుగా ప్రచారం ప్రత్యేక కార్యాచరణతో 32వ వార్డును అభివృద్ధి చేస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని తలారి రాధమ్మ వెల్లడి మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు. జిల్లా ఎస్పీ జగదీష్.

మదనపల్లి టిడిపి ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు గెలుపే లక్ష్యం : కూటమి పార్టీల అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు - క్రిష్టియన్ పాస్టర్స్,టైలర్స్,ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అసోసియేషన్లు వెల్లడి

Select Suryaa Now
మదనపల్లి టిడిపి ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు గెలుపే లక్ష్యం : కూటమి పార్టీల అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు - క్రిష్టియన్ పాస్టర్స్,టైలర్స్,ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అసోసియేషన్లు వెల్లడి

 

మదనపల్లె,మేజర్ న్యూస్ : పట్టణంలోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో క్రిష్టియన్,పాస్టర్స్ అసోసియేషన్,టైలర్స్ అసోసియేషన్,ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూటమి పార్టీల అభ్యర్థులకు,చైర్మన్ అభ్యర్థికి మద్ధతు ప్రకటించారు.మదనపల్లె మున్సిపాలిటీలో కూటమి పార్టీల టిడిపి అభ్యర్థి  శ్రీరామ్ కుమార్ (చినబాబు)ను,కౌన్సిలర్స్ అభ్యర్థులను గెలుపుకు మద్దతు కోరుతూ యెనుగొండ రాజగోపాల్ నాయుడు,నారా రెడ్డెప్ప,రాష్ట్ర చేనేత నాయకులు గజ్జలకుంట నాగరాజు,టీం కో-ఆర్డినేషన్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులు,రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు  శ్రీరామ్ చినబాబుకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మునిసిపల్ ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ చినబాబు మాట్లాడాతూ మదనపల్లెలో పారిశుద్ధ్యం,మెరుగైన మురుగునీటి సరఫరా వ్యవస్థ,రోడ్లు అభివృద్ధి,మౌలిక సదుపాయల కల్పనకు మొదటి ప్రాధాన్యతనిచ్చి సమస్యలను ప్రాధాన్యతతో  పరిష్కరిస్తామన్నారు.అంతే కాకుండా రాష్టం కేంద్రంలో  వివిధ శాఖల మంత్రులతో వున్న సంబంధాలతో అత్యధికంగా నిధులు రాబట్టి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఇందుకు పుర ప్రజలు తనకు అవకాశమిస్తూ ఆశీర్వదించాలని అభ్యర్థించారు.ఇప్పటికే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మదనపల్లె అభివృద్ధికి పెద్దపీట వేస్తూ లక్షకోట్లతో మదనపల్లె కేంద్రంగా హార్టికల్చర్ హబ్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.హార్టికల్చర్ హబ్ ఇవ్వడం వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయని,కావున ప్రజలంతా విజ్ఞత ఆలోచించి అభివృద్ధి పటం కట్టాలని కోరారు.అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల సమస్యలు,టైలర్స్ సమస్యలు ఏమి ఉన్నా అధిష్టానంతో మాట్లాడి వాటిని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.మునిసిపల్ పరిధిలో ఉన్న 48 వార్డులలో కూటమి అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థిగా తనను ఆశీర్వదిస్తూ మద్దతు తెలపాలని కోరారు.ఇందులో భాగంగా వివిధ సంఘాల నాయకులు ఐక్యంగా తాము కూటమి అభ్యర్థులకు వార్డులలో సహకారం ఇచ్చి శ్రీరామ్ చినబాబుకు తోడుగా  అభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు,ప్రతినిధులు,విద్యార్థి సంఘం నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం,ఇంచార్జి