ప్రత్యేక కార్యాచరణతో 32వ వార్డును అభివృద్ధి చేస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని తలారి రాధమ్మ వెల్లడి
మదనపల్లి,మేజర్ న్యూస్ : తనకు ఒక అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని కూటమి బలపరిచిన టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని తలారి రాధమ్మ స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి,కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తలారి రాధమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్నిరంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలుతో ప్రతి ఇంట ఆనందం వెల్లివిరుస్తోందన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారధ్యంలో మదనపల్లి పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.గతంలో వార్డును ఎంతో అభివృద్ధి చేశానని,మరో అవకాశం ఇస్తే ప్రజాసేవకు పునరంకితమవుతానని హామీ ఇచ్చారు.ఆదివారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి టిడిపి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు,32వ వార్డు అభ్యర్థినిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి