47వ వార్డులో హోరెత్తిన తెలుగుదేశం ప్రచారం : ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి అడగుడునా అపూర్వ స్వాగతం - టిడిపి అభ్యర్థి రెడ్డి కేశవులను గెలిపించాలని విజ్ఞప్తి
మదనపల్లి,మేజర్ న్యూస్ : 47వ వార్డులో తెలుగుదేశం పార్టీ ప్రచారం హోరేత్తింది.కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి రామిశెట్టి రెడ్డి కేశవుకు (కమలామర్రి)కి మద్ధతుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రచారంలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించారు.ముందుగా ఎమ్మెల్యేకి రామిశెట్టి కృష్ణ (కమలామర్రి) పూలమాల వేసి,శాలువాతో సన్మానించి అపూర్వ స్వాగతం పలికారు.ఎమ్మెల్యేకి స్థానిక ప్రజలు అడుగడుగునా జననీరాజనం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.ముఖ్యంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలుతో ప్రతి ఇంట ఆనందం వెల్లివిరుస్తోందన్నారు.47వ వార్డులో చేనేత కార్మికుల ఎక్కువగా నివసిస్తున్నారని,వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.నేతన్న సేవలో పథకం అర్హులైన చేనేత కార్మికులకు వర్తింపజేసి భరోసా కల్పించామన్నారు.త్వరలోనే నీరుగట్టువారిపల్లి పట్టుచీరలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తామని,కోట్లాది రూపాయలతో పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చామన్నారు.యువకుడు,ఉత్సాహవంతుడైన రెడ్డి కేశవులను గెలిపిస్తే ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు వార్డు అభివృద్ధికి కృషిచేస్తారని హామీ ఇచ్చారు.నవంబర్ 1న జరిగే మునిసిపల్ ఎన్నికలలో కూటమి ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు),వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రెడ్డి కేశవులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),మోడెం సిద్ధప్ప,రామిశెట్టి నీలకంఠ,నాగరాజు,శిబ్యాల వేణుగోపాల్,రామిశెట్టి రెడ్డి శేఖర్,సురేష్,రామిశెట్టి లక్ష్మీదేవి,శ్రావణి,కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి