సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..
సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి..
అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..
రొంపిచెర్ల జెడ్పీటీసీ అభ్యర్థి కోటా సుష్మ.
రొంపిచెర్ల, మేజర్ న్యూస్: రొంపిచెర్ల మండల అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం కల్పించాలని, ప్రజల ఆదరణతో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రొంపిచెర్ల జడ్పీటీసీ అభ్యర్థి కోటా సుష్మ అన్నారు. గురువారం గానుగ చింత, మోటుమల్లెల గ్రామపంచాయతీల పరిధిలో ఆమె వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా కోటా సుష్మ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
తాను ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఒక్క అవకాశం కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ, రొంపిచెర్ల మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలందరూ తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.
ఈ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, రెడ్డీశ్వర్ రెడ్డి, విజయశేఖర్, కోటా వెంకటరమణ, కృష్ణ మహేష్, గోపీనాథ్ రెడ్డి, కుమార్ నాయుడు, సురేంద్ర నాయుడు, రామకృష్ణ నాయుడు, శ్రీనాథ్ నాయుడు, బాబు, తదితరులు పాల్గొన్నారు.