BREAKING
రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. నిధులు తెప్పించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఈటల రాజేందర్ రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలి.. -తహసీల్దార్ శ్రీకాంత్. అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత దేవినేని అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో ఉంటుంది: హీరో వెంకటేశ్ తమిళనాడులో సినిమా షోల వేళల్లో మార్పులు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం

తమిళనాడులో సినిమా షోల వేళల్లో మార్పులు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు

Select Suryaa Now
తమిళనాడులో సినిమా షోల వేళల్లో మార్పులు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అనుమతి కోరిన నిర్మాతలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తమిళనాడులో సినిమా ప్రదర్శన వేళలకు సంబంధించి కోలీవుడ్ వర్గాల నుంచి కీలక డిమాండ్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో సినిమా థియేటర్ల నిర్వహణను మరింత మెరుగుపరచాలని, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ తమిళ సినీ నిర్మాతల సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి రాజ్ మోహన్ అధ్యక్షతన చెన్నైలోని ట్రిప్లికేణి కలైవానర్ అరంగంలో తమిళ సినీ ప్రముఖులు మరియు వివిధ నిర్మాతల సంఘాల ముఖ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఇతర దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు కేరళలో అమల్లో ఉన్న విధంగానే తమిళనాడులో కూడా ఉదయం 6 గంటల నుంచే మొదటి ఆటను ప్రదర్శించుకునేలా వెసులుబాటు కల్పించాలని నిర్మాతలు కోరారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు నిరంతరంగా సినిమా షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల ఒకే రోజులో ఐదు నుంచి ఆరు షోలను ప్రదర్శించే అవకాశం లభిస్తుందని, దీని ద్వారా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మెరుగవుతాయని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఒకే రోజు పలు సినిమాలు విడుదలైన సందర్భాల్లో థియేటర్ల సర్దుబాటు సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో కేవలం షోల సమయాల పెంపుదల మాత్రమే కాకుండా మరికొన్ని ప్రధాన డిమాండ్లను కూడా నిర్మాతలు మంత్రి ముందుంచారు. కొత్తగా విడుదలయ్యే సినిమాలను కనీసం ఎనిమిది వారాల గడువు పూర్తయిన తర్వాతే ఓటీటీ వేదికలలో స్ట్రీమింగ్ చేసేలా నిబంధనలు గా అమలు చేయాలని కోరారు. అలాగే నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే స్వయంగా ఒక ప్రత్యేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని, విడుదలకు నోచుకోని చిన్న చిత్రాలను థియేటర్లలోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్నబడ్జెట్ సినిమాలకు ప్రభుత్వపరంగా సబ్సిడీలు అందించి ఆదుకోవాలని వారు కోరారు. నిర్మాతలు లేవనెత్తిన ఈ విజ్ఞప్తులన్నింటినీ సానుకూలంగా ఆలకించిన మంత్రి రాజ్ మోహన్, తమిళ సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తరపు నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తామని, త్వరలోనే సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇస్తూ భేటీని ముగించారు.