BREAKING
ఫ్యాషన్ సలహా ఇచ్చిన కరణ్ జోహార్ కరిష్మా కపూర్ పంచుకున్న అరుదైన జ్ఞాపకం ఎక్సైజ్ స్టేషన్లో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించిన ఆప్కారి శాఖ సీఐ మంగమ్మ..! జడ్పీటీసీ సమరంలో ఇద్దరు మహిళలు! * బరిలో తెదేపా, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు * వైకాపా అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ * నవంబరు 5న పోలింగ్.. ఉత్కంఠలో మండల ప్రజలు కనపర్తి నుంచి వెండితెరకు… దర్శకుడు రమేశ్ చెప్పాల మరో ముందడుగు!బండ్ల గణేశ్‌ నిర్మాణంలో ‘ఫేర్ వెల్’… 'జుమాంజి ఓపెన్ వరల్డ్' కొత్త ట్రైలర్ విడుదల హరీష్ కళ్యాణ్, సిద్ధి ఇద్నానీ నటించిన 'నూరు కోటి వానవిల్' ట్రైలర్ విడుదల! కమలానగర్‌లో టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార జోరు.. ప్రధాన అభ్యర్థులకు దీటుగా స్వతంత్ర అభ్యర్థి దూకుడు.. వాల్మీకి సమాజం భారీ మద్దతుతో ముందుకు సాగుతున్న మేయర్ అభ్యర్థి.. ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి! తిరుపతిలో వైసీపీకి ఎదురుదెబ్బ.... -వైసీపీ నుంచి జనసేన లోకి వలసల బాట -54వ డివిజన్ పరిధిలో మహిళలు 100 మంది చేరిక -జనసేన నేతల సమీక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహిళలు -కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతికి పెరుగుతున్న ప్రజాదరణ -జనసేన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి : నేతలు పిలుపు రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. నిధులు తెప్పించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఈటల రాజేందర్ రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలి.. -తహసీల్దార్ శ్రీకాంత్. అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ఎంపీటీసీ అభ్యర్థి శ్యామలమ్మ విజ్ఞప్తి హాలీవుడ్ లెజెండ్ ప్యాట్రిక్ స్టెవార్ట్ కన్నుమూత దేవినేని అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. మండల అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళ రెడ్డి శేఖర్ విజ్ఞప్తి

రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. నిధులు తెప్పించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఈటల రాజేందర్

Select Suryaa Now
రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా.. నిధులు తెప్పించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ జిల్లా ప్రధాన ప్రతినిధి, మేజర్ న్యూస్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యపై చేపట్టిన పాదయాత్రలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డంపింగ్ యార్డును తొలగించాలని తాను పాదయాత్ర చేస్తుంటే.. ఈటల రాజేందర్‌కు పనిలేక తిరుగుతున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారట అంటూ ఘాటుగా స్పందించారు. "నేను డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కోసం మాత్రమే తిరగడం లేదు.. మీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుతా" అంటూ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఎంత ఖర్చవుతుందో సమగ్ర డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రూపొందించి ఇవ్వాలని కోరారు. ఆ నివేదిక ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి అవసరమైన నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ.. "అలా నిధులు తీసుకురాలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా" అంటూ సవాల్ విసిరారు.జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పాదయాత్ర సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మేడ్చల్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.