BREAKING
30వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఎస్. మహబూబ్ బాషా విస్తృత ప్రచారం మిషన్ కాటన్ పై లింగంపల్లి రైతులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఉక్రేనియన్ రష్యన్ ఆక్రమిత ఒలేష్కీ పట్టణం వైపు కదిలిన మానవతా సహాయక కాన్వాయ్ సూర్య స్టాఫ్ రిపోర్టర్ షేక్ మహమ్మద్ రఫీకి జాతీయ పురస్కారం చైనా టెలికాం సంస్థలకు అమెరికా ఫోన్ నంబర్ల యాక్సెస్ రద్దు అమెరికా, దక్షిణ కొరియా వాయు రక్షణ విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జీకే మనీ ఇంటింటి ప్రచారం ఉత్తర కొరియా సరిహద్దు ఉల్లంఘనలపై గట్టిగా స్పందిస్తాం ఆసియాన్ ప్రత్యేక రాయబారి మయన్మార్ పర్యటన రాబర్ట్ కేలర్ కెల్లీ మరణానికి అసలు కారణం ఇదే! చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామి సేవలో ఎంపీ ఈటల రాజేందర్ హాలీ బెర్రీకి కస్టడీ కేసులో బిగ్ రిలీఫ్! కళ్యాణదుర్గమ్మ అభివృద్ధికి తోడ్పాటు అందించండి కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు శ్రీరామ్ 'ప్రేమద ఊరాలి' బాక్సాఫీస్ ధమాకా హాలోవీన్ స్పెషల్ మూవీ 'ధూమకేతు'

కమలానగర్‌లో టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార జోరు.. ప్రధాన అభ్యర్థులకు దీటుగా స్వతంత్ర అభ్యర్థి దూకుడు.. వాల్మీకి సమాజం భారీ మద్దతుతో ముందుకు సాగుతున్న మేయర్ అభ్యర్థి.. ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి!

Select Suryaa Now
కమలానగర్‌లో టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార జోరు..   ప్రధాన అభ్యర్థులకు దీటుగా స్వతంత్ర అభ్యర్థి దూకుడు..   వాల్మీకి సమాజం భారీ మద్దతుతో ముందుకు సాగుతున్న మేయర్ అభ్యర్థి..   ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి!

(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్న వేళ స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి సైతం తనదైన శైలిలో ప్రచార జోరు పెంచుతూ ఎన్నికల బరిలో తన ఉనికిని చాటుతున్నారు.ప్రచారంలో భాగంగా కమలానగర్ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. వాల్మీకి సమాజానికి చెందిన బంధువులు, సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడుస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. వీధివీధినా ప్రజలను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని, మేయర్‌గా అవకాశం కల్పించాలని వెంకటేష్ వాల్మీకి కోరారు.
ప్రధాన అభ్యర్థులకు పోటీగా ప్రచార జోరు..ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో స్వతంత్ర అభ్యర్థిగా టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రజల్లోకి వెళ్లడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కమలానగర్‌లో ఆయనకు లభించిన ఆదరణ, వాల్మీకి సమాజ ప్రజల భాగస్వామ్యం ప్రచారానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి..
తన ఎన్నికల గుర్తు ఉంగరం అని, మేయర్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. నగరంలోని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, నగర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.కమలానగర్ ప్రజల ఆదరణ మరువలేనిది..ఈ సందర్భంగా టోపీ వెంకటేష్ వాల్మీకి మాట్లాడుతూ.. కమలానగర్ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు, ఆదరణ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అన్నారు. వాల్మీకి సమాజం ఐకమత్యంగా ఉండాలని, సమాజ అభివృద్ధితో పాటు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్రజల ఆశీస్సులు, మద్దతుతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని, తన గెలుపులో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రధాన అభ్యర్థుల ప్రచారానికి ఏమాత్రం తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్న టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచారం నగర మేయర్ ఎన్నికల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.