చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామి సేవలో ఎంపీ ఈటల రాజేందర్
కీసర, మేజర్ న్యూస్: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేతను డిమాండ్ చేస్తూ చేపట్టిన 'జన సంకల్ప పాదయాత్ర' 4వ రోజు పర్యటనలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చీర్యాల గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఎంపీకి ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పుష్పార్చన నిర్వహించిన అనంతరం, కళ్యాణ మండపంలో ఎంపీ ఈటల రాజేందర్‌కు శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ఆయనకు వేదాశీర్వచనం అందించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లాల తిరుమల రెడ్డి, అర్బన్ బీజేపీ సీనియర్ నాయకులు కనుకుల రజినీకాంత్ రెడ్డి, బోడ శ్రీనివాస్ రావు, కీసర డివిజన్ అధ్యక్షుడు కోలా బాలరాజు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.