8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలోని 8వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి ఎస్. మురధు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని వివిధ వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా జనసేన కౌన్సిలర్ అభ్యర్థి ఎస్. మురధుకు గాజు గుర్తుపై ఒక ఓటు, టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తికి సైకిల్ గుర్తుపై మరో ఓటు వేసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్