BREAKING
విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి అళ హరి విజయ్ కుమార్ పిరంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై రైతులకు సూచనలు ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎస్సీ సెల్ టౌన్ కమిటీ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో హవా చాటుతున్న ఎమ్మెల్యే కాకర్ల పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన క్రీడల్లోనూ అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ రాజన్న సిరిసిల్ల PRGTA నూతన బాడీకి కలెక్టర్ శుభాకాంక్షలు రూరల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయే రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలి మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో.. మెగా రక్తదాన శిబిరం శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం

శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
నవంబర్ 1వ తేదీ ఆదివారం జిల్లాలోని పుట్టపర్తి, హిందూపురం, కదిరి, పెనుకొండ, మడకశిర, ధర్మవరం మున్సిపాలిటీల పరిధిలో జరగనున్న పోలింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఎన్నికల భద్రతా విధుల కోసం సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ గారు వివరించారు. 
పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక (సెన్సిటివ్), అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్) కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సివిల్ పోలీసులతో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీలు, ఏపీఎస్పీ బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. 
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక పోలీసు బృందాలు, రూట్ మొబైల్స్, 61 స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర గస్తీ, పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. 
అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను సైతం సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
ఎన్నికల నియమావళి అమలులో 
(BNSS )సెక్షన్ 163 పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్న నిబంధనలతో  పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని అరికట్టడంతో పాటు అక్రమ నగదు, మద్యం రవాణాను నియంత్రించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.