మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో.. మెగా రక్తదాన శిబిరం
మణుగూరు ఆర్ సి సూర్య ; పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక కిన్నెర కళ్యాణ మండపంలో సుమారు యాభై మందికి పైగా రక్తాన్ని దానం చేశారు. ముందుగా మణుగూరు డిఎస్పీ వి.రవీందర్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.అనంతరం డిఎస్పీ రవీందర్ రెడ్డి, సి ఐ లు నాగబాబు,వెంకటేశ్వరరావు,ఎల్లయ్య,ఎస్సైలు నగేష్,రవూఫ్, రఘు,పివిఎన్ రావు లు రక్తదానం చేశారు.రక్తదానం చేసి మరొక ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చిన రక్తదాతలను పోలీసులు అభినందించి ప్రశంశాపత్రాలు అందజేశారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా