విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ
నవాబుపేట సూర్య న్యూస్:మండల పరిధిలోని గుబ్బడిగుచ్చ తండా ప్రాథమిక పాఠశాలను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకట్‌రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా?కడుపునిండా భోజనం పెడుతున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.పాఠశాలను ప్రత్యేకంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించడంతో సందర్శించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ జయరాం నాయక్ ప్రీప్రైమరీ పాఠశాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రధానోపాధ్యాయుడు భూపతిసింగ్ ప్రీప్రైమరీ సిబ్బంది వివరాలను వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ జ్యోతి పాల్గొన్నారు.