రాజన్న సిరిసిల్ల PRGTA నూతన బాడీకి కలెక్టర్ శుభాకాంక్షలు
సూర్య..రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ని నూతన PRGTA జిల్లా కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. PRGTA రాష్ట్ర అధ్యక్షులు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా శంకర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా మనోహర్, ఉపాధ్యక్షురాలుగా కవిత, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా తిరుముల, రమేష్, కార్యదర్శిగా ఎల్లేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన బాడీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపి, గురుకుల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి సానుకూలంగా తెలియజేస్తానని హామీ ఇచ్చారు.