స్థానిక ఎన్నికల్లో హవా చాటుతున్న ఎమ్మెల్యే కాకర్ల
సీతారామపురం, మేజర్ న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయగిరి నియోజకవర్గం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నియోజకవర్గంలో 8 మండలాలు ఉండగా సీతారామపురం మండలం లోని జడ్పిటిసి స్థానం, మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి వైసీపీ పార్టీ ఈ మండలంలో పోటీలో నిలవలేకపోయింది. అంతేకాక నియోజకవర్గంలోని ఉదయగిరి దుత్తలూరు వరికుంటపాడు మండలాల్లో 10 ఎంపీటీసీ స్థానాలు కూటమి పార్టీ ఏకగ్రీవంగా చేసుకోగలిగింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న అభివృద్ధిని చూసి పలు గ్రామాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నడంతో పోటీ చేయడానికి కూడా ప్రతిపక్ష వైసిపికి అభ్యర్థులు కరువయ్యారు ఇంతటి స్థాయిలో జిల్లాలో ఒక మండలం మొత్తం జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలు కైవసం చేసుకున్న దాఖలాలు ఎన్నికల్లో లేవు. మిగిలిన ఏడు మండలాలు కూడా ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలు ఎంపీపీ పదవులు కైవసం చేసుకునే దిశగా కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో ప్రచారంలో కూటమి పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.