BREAKING
సౌర శక్తి వైపు అడుగులు కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు. యస్.ఈ కే వెంకటేశ్వర్లు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ 36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి

ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Select Suryaa Now
ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి*   *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

*ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి*


*జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

కర్నూలు,మేజర్ న్యూస్ ప్రతినిధి,అక్టోబర్ 30:- స్థానిక సంస్థల ఎన్నికల విధులకు నియమించిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు..

శుక్రవారం ఉదయం స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ పై సంబంధిత అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు విడతల వారీగా నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది శిక్షణకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గర్భిణులు, బాలింతలు, ఇటీవల గుండె సంబంధిత లేదా వెన్నెముక శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు వంటి నిజమైన వైద్యపరమైన కారణాలున్న వారికి మాత్రమే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు పరిశీలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సాధారణ ఆరోగ్య సమస్యలు, గతంలో శస్త్రచికిత్సలు జరిగినట్లు పేర్కొంటూ మినహాయింపులు కోరడం సమంజసం కాదన్నారు. ఎన్నికల విధులు బాధ్యతతో కూడుకున్నవని, ప్రతి ఒక్కరూ కేటాయించిన విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలన్నారు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.. పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో సిబ్బంది సమయానికి విధులకు హాజరై, ఎన్నికల నిబంధనలు, నిర్దేశిత విధానాలను ఖచ్చితంగా పాటించాలన్నారు.  ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధులకు నియమితులైన అధికారులు, సిబ్బంది రేపు ఉదయం 7.30 నుంచి 8 గంటలలోపు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. జిల్లాలోని నాలుగు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సిబ్బంది హాజరును కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల హెచ్‌ఓడీలు తమ శాఖలకు చెందిన ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది సమయానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకునేలా బాధ్యత తీసుకోవాలన్నారు. సిబ్బంది హాజరును సంబంధిత శాఖల పరిధిలోని పర్యవేక్షక అధికారులు కూడా మండలాల వారీగా పర్యవేక్షించి, ఉదయం 8 గంటల నుంచి ఎంతమంది విధులకు హాజరయ్యారనే వివరాలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. రిజర్వ్‌లో ఉన్న సిబ్బంది సైతం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు హాజరై తమ అటెండెన్స్ నమోదు చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయి, పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించే వరకు రిజర్వ్ సిబ్బంది సహా ఎన్నికల విధులకు నియమితులైన ఏ ఒక్కరూ విధుల నుంచి వెళ్లడానికి వీల్లేదన్నారు. రిజర్వ్ సిబ్బంది కమిషనర్ లేదా సంబంధిత జోనల్ అధికారుల పర్యవేక్షణలో ఉండాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.. ప్రతి శాఖలో నియమితులైన సిబ్బంది సంఖ్య, విధులకు హాజరైన వారి సంఖ్య, గైర్హాజరైన వారి వివరాలను సంబంధిత పర్యవేక్షక అధికారులు సేకరించి శాఖల హెచ్‌ఓడీలకు, అక్కడి నుంచి జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అందించాలన్నారు. అదే విధంగా, ఎన్నికల విధుల నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ప్రతి శాఖ నుంచి ఒక బాధ్యతాయుతమైన అధికారిని జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కేటాయించాలని జాయింట్ కలెక్టర్ హెచ్‌ఓడీలను ఆదేశించారు.

టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు, ఆర్వో లు తదితరులు పాల్గొన్నారు..