ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్
హిందూపురం: - శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజుల పేరుతో కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి మూడింతలు అధికంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురిచేయడం దారుణమని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు బాబావలి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం పట్టణంలో శుక్రవారం విద్యార్థి సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజులకంటే అధికంగా వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యను వ్యాపారంగా మార్చి,పరీక్షల పేరుతో విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం ఎంత మాత్రం సహించరాని విషయమని పేర్కొన్నారు.ఇంటర్ అధికారులు తక్షణమే స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలను ప్రతి కార్పొరేట్ ప్రవేట్ కళాశాలలో స్పష్టంగా ప్రదర్శించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు పట్టణ నాయకులు అనుదీప్ నాగేంద్ర ఆకాష్ నంజుండేశ్వర అనిల్ వలిసబ్ సురేష్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం సూర్య స్టాఫ్ రిపోర్టర్ నాగేంద్ర