BREAKING
మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రచారం ముగింపు సందర్భంగా, భారీ ర్యా లీ నిర్వహించనున్న ఎమ్మెల్యే. సౌర శక్తి వైపు అడుగులు కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు. యస్.ఈ కే వెంకటేశ్వర్లు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ 36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ

పిరంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై రైతులకు సూచనలు

Select Suryaa Now
పిరంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై రైతులకు సూచనలు

కుల్కచర్ల, మేజర్ న్యూస్: వాతావరణ పరిస్థితుల్లో రానున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సూచించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పిరంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వరి పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి సాగు చేస్తున్న పంటలు, నీటి లభ్యత, వ్యవసాయ పరిస్థితులపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక నీటి వినియోగం అవసరమయ్యే వరి పంటకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల కూరగాయల పంటలపై రైతులు ఆసక్తి చూపాలని తెలిపారు. నీటి లభ్యత, భూసార పరిస్థితులు, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

 అనంతరం వి.బి.జి. రామ్ జీ పథకం కింద చేపట్టే పనులను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు నీటి వనరులను కాపాడుకోవచ్చని వివరించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలో చేపడుతున్న ఫామ్ పాండ్ పనులను పరిశీలించి వాటి పురోగతిని సమీక్షించారు. వ్యవసాయ అభివృద్ధితోపాటు నీటి సంరక్షణ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: వడ్ల వినోద్ కుమార్, కుల్కచర్ల, వికారాబాద్ జిల్లా.