పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన
సూర్య, మాక్లూర్::మహాత్మా జ్యోతిబా పూలే విద్యార్థులు మాక్లూర్ పోలీస్ స్టేషన్‌ను ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే విధులు, పోలీసు సిబ్బంది బాధ్యతలు, స్టేషన్‌లో జరిగే వివిధ కార్యకలాపాల గురించి విద్యార్థులకు వివరించారు.పోలీసుల విధి నిర్వహణ, ప్రజలకు అందించే సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను తెలియజేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధివిధానాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.