BREAKING
నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి అళ హరి విజయ్ కుమార్ పిరంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై రైతులకు సూచనలు ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎస్సీ సెల్ టౌన్ కమిటీ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో హవా చాటుతున్న ఎమ్మెల్యే కాకర్ల పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన

శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు

Select Suryaa Now
శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు

సూర్య అశ్వరావుపేట,అశ్వారావుపేట కోనేరు బజార్ లోని అతి పురాతనమైన కాశి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు సుమారు 30 మంది  శివ భక్తులు ఈ శివమాల ధారణను శుక్రవారం నాడు ధరించారు. ఈ స్వాములు 12వ జ్యోతిర్లింగమైన ఘృష్ణశ్వరుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీనగర్) సమీపంలో ప్రసిద్ధ ఎల్లోరా గుహల వద్ద ఉన్నా స్వామిని దర్శించి అక్కడ ఇరుముడి సమర్పించనున్నారు వీరు  మండల దీక్ష 41 రోజులు అనంతరం ఆ దైవ క్షేత్రానికి బయలుదేరి వెళ్తారు. కొంతమంది స్వాములు కాశి, రామేశ్వరంల లో ఉన్న జ్యోతిర్లింగాల వద్ద మొక్కులు ఉన్నందున అక్కడ కూడా ఇరుముడి సమర్పించనున్నారు. గురు స్వామి అయినటువంటి జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ శివాజ్ఞతో ఈసారి తను స్వయంగా 34 సార్లు శివమాల ధరించాను అని ఇప్పటివరకు అన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరిగింది అని ఆఖరిజైన 12వ జ్యోతిర్లింగం ఈ సంవత్సరం మరో మారు ఇరుముడి సమర్పించుటకు తన భక్తులతో వెళుతున్నామని ఎంతో విశిష్టమైన ఘృష్ణశ్వరుడు ఆలయానికి వెళుతున్నాము అని ఘుష్మ అనే భక్తురాలి భక్తికి మెచ్చి, ఆమెకు చనిపోయిన కుమారుడిని బ్రతికించి శివుడు ఇక్కడ ఘృష్ణశ్వరుడిగా వెలిశాడు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అదేవిధంగా 41 రోజులపాటు ఎంతో భక్తిశ్రద్ధలతో శివమాల ధరించి శివన్నామస్మరణ చేస్తే ఆ శివుని కృప ఎల్లవేళలా తమపై ఉంటుంది అని అనుకున్న పనులన్నీ సవ్యంగా కొనసాగుతాయి అని అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అని ప్రతిరోజు శివాలయంలో ఉదయం ఐదు గంటలకు అభిషేకాలతో పూజ ప్రారంభమవుతుంది అని ఎంతో భక్తిశ్రద్ధలతో శివ మాల ధారణ నిర్వహించుకోనున్నాము అని అన్నారు.శివమల ధరించిన వారిలో  గురుస్వామి యేసు, టేకి నాగు,నాగరాజ్ సింహాచలం,శివానందం వెంకన్న,సుధీర్, శ్రీను, మట్లకుంట చంద్రశేఖర్, కేశిబోయిన వీరాంజనేయులు 
చెన్నారావు,సుబ్రహ్మణ్యం,ఆరేపల్లి నాగేశ్వరావు  తదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట