రూరల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
రూరల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
-బీఆర్ఎస్వీ రాష్ట్ర యువ నాయకుడు మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి
సిద్దిపేట రూరల్ : వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న సిద్దిపేట రూరల్ మండల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర యువ నాయకుడు మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.రూరల్ మండలాన్ని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించి, అదనపు కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు వర్షాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, వారి గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. మండలంలోని 11 రెవెన్యూ గ్రామాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించి పంట నష్టాన్ని గుర్తించాలని, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు.2026 వానాకాలం సాగు పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసి రైతులకు జరిగిన నష్టంపై స్పష్టమైన వివరాలు వెల్లడించాలని కోరారు. కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిద్దిపేట రూరల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
(సూర్య రూరల్, రమేష్)