BREAKING
సౌర శక్తి వైపు అడుగులు కాలుష్య రహిత భవిష్యత్తుకు వెలుగులు. యస్.ఈ కే వెంకటేశ్వర్లు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ 36వ డివిజన్‌లో మల్లేశ్వరి తరఫున మాజీ మేయర్ మదమంచి స్వరూప ప్రచారం.. అరవింద్ నగర్ మసీదు సమీపంలో మైనార్టీ ఓటర్లను కలిసి మద్దతు కోరిన మాజీ మేయర్.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ అండ.. అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి.. బ్యాంకింగ్ సేవలపై కళాజాతతో అవగాహన: ఎల్‌డీఎం శివప్రసాద్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి - ఎస్సీ కాలనీవాసుల ఆవేదన కార్పొరేటర్ అభ్యర్థులుగా మా ఆత్మీయులు పరిటాల సునీతమ్మ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంసిపల్లి ఎం పి టి సి రాధాకృష్ణ సవాల్ కు ప్రతి సవాల్ పది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోత సర్పంచ్ ఉటుకూరి మాధవరెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి

ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయే రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలి

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయే రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలి

ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయే రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలి

కరువు మండలాల సంఖ్య పెంచాలి – ఎకరాకు రూ.20 వేల పరిహారం అందించాలి

తెలుగుదేశం పార్టీ నాయకులు పోగుల సైదులు గౌడ్

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పోగుల సైదులు గౌడ్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కరువు మండలాల సంఖ్యను పెంచాలని, నష్టపోయే రైతులు, రైతు కూలీలకు అండగా నిలిచేందుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం యాసంగి పంటలు సాగు చేయవద్దని సూచిస్తే, పంటలు వేయకుండా నష్టపోయే రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతుబంధు పథకంతో సంబంధం లేకుండా రైతులకు, రైతు కూలీలకు ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితులపై చర్చించేందుకు అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి, సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలని సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం ఇప్పటి నుంచే పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని పోగుల సైదులు గౌడ్ కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గంధం శ్రీనివాస్, మాజీ నల్లగొండ పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ జానిమియా, మైనార్టీ సెల్ పార్లమెంట్ కోశాధికారి షేక్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.