తిరుపతి మేయర్ గా జేబీ శ్రీనివాస్ కార్పొరేటర్ గా పృద్విరెడ్డి భారీ మెజారిటీతో గెలుపు తధ్యం............ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి
తిరుపతి కూటమి అభ్యర్థి జేబీ శ్రీనివాస్, 52వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పృథ్వీ రెడ్డినీ గెలుపు ఖాయమని తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పూల వర్షం డ్రమ్స్ హోరు 52వ డివిజన్‌లో పండుగలా కూటమి ఎన్నికల ప్రచారంలో డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్‌లో ఎన్డీయే కూటమి బలపరిచిన భాజపా కార్పొరేటర్ అభ్యర్థి గుడిపల్లి పృథ్వీ రెడ్డి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ఈ భారీ ప్రచార ర్యాలీలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తో పాటు టిటిడి పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి , జనసేన యువ నాయకుడు ప్రణీత్, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ముఖ్య నాయకులు పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు. డివిజన్‌లో అడుగుపెట్టిన కూటమి నేతలకు స్థానిక ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా నీరాజనాల పలికారు.నాయకులపై అభిమానులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. డివిజన్‌లోని ప్రతి గడపకూ వెడుతూ, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ గుడిపల్లి పృథ్వీ రెడ్డి , మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలు ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 52వ డివిజన్‌లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు,మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చురుకైన యువ నాయకుడు గుడిపల్లి పృథ్వీ రెడ్డి గెలుపు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే పృథ్వీ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని, ఇక మెజారిటీ లెక్కే మిగిలి ఉందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని కూటమి సీనియర్ నాయకులు, మూడు పార్టీల కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.